కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని పాన్ షాప్ లు మైనర్ పిల్లలను, యువకులను లక్ష్యంగా చేసుకొని వారికి హుక్క, గుట్కా అలవాటుచేసి వారి బంగారు భవిష్యత్ ను నాశనం చేస్తు, అధిక సొమ్మును అర్జిస్తున్నారన్నా సమాచారంతో శనివారం ఎస్పీ, ఏఎస్పీ ఆదేశాలతో పట్టణ సీఐ.నరహరి ఆధ్వర్యంలో కిల్లికొట్టులపై దాడులు నిర్వహించారు. ఎంఎం. కిల్లికొట్టు నుండి గుట్కాలు, హుక్కా పరికరాలు స్వాదినం చేసుకున్నట్లు సీఐ. నరహరి తెలిపారు. ఎంఎం షాప్ ను తనిఖీ చేయగా, ఇంటి యజమాని జాకీర్ హుస్సేన్ లపై కేసులు నమోఫు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వాటి విలువ లక్ష 3వేల రూపాయల వరకు ఉంటుందన్నారు.