విదేశాలలో ఉద్యోగాలు ఎరగా చూపి మహిళలను విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠా ఆగడాలపై సాక్షాత్తు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధికి బాధిత మహిళ ఫిర్యాదు . నూజివీడు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధిత మహిళ అరిగెల అమృతవల్లి బుధవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల సమయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరిగల అమృతవల్లి స్థానిక విలేకరులతో మాట్లాడారు. నూజివీడు పట్టడానికి చెందిన అమృతవల్లి తాము నివసించే సమీపంలో ఉంటున్న కాటుమాల శ్రీకాంత్ నూజివీడు ట్రిపుల్ ఐటీ లో విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. సంధ్య ఆమె భర్త మేడికొండ సాంబయ్య అనేవారు జేఎన్టీయ