ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను శనివారం అధికారికంగా నిర్వహించారు. ఆయన ఉప్పు సత్యాగ్రహం సాగించిన దేవరంపాడు లోని విజయ స్తూపం వద్ద జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ తో పాటు పలువురు జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులర్పించారు. ప్రకాశం పంతులు ధైర్య సాహసాలను,నీతి నిజాయితీలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జెసి కోరారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు