Download Now Banner

This browser does not support the video element.

మర్రిగూడ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Marriguda, Nalgonda | Jul 13, 2025
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండలంలోని కేజీబీవీ లో 2024-25 లో పదవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం శాలువాలతో సత్కరించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని ఉన్నత స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. వచ్చే ఏడాది నగదు బహుమతులను మరింత పెంచుతామని హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us