యూరియా కోసం రైతులకు ప్రతిరోజు తిప్పలు తప్పడం లేదు. నంగునూరు మండల కేంద్రంలోని ఆగ్రోస్ వద్దకు మంగళవారం యూరియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి నిలబడలేక ఓపిక లేక వృద్ధులు, మహిళలు పాదరక్షలను క్యూ లైన్ లో పెట్టారు. తమ వంతు కోసం ఎదురు చూశారు. రైతులు తమ పొలం పనులు వదిలిపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూస్తున్నారు. అటు పొలం పనులు కాక.. ఇటు యూరియా బస్తాలు దొరకక ఆవేదన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఇప్పటికైనా రైతులకు సరిపడే యూరియా అందించే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతు