ఎరువులు ఎంత తక్కువగా వినియోగిస్తే రైతులకు, రాష్ట్రానికి అంతగా ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు మంగళవారం భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "పొలం పిలుస్తుంది" కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని, ఈ పంట నమోదు, అధిక ఎరువుల వినియోగం అనర్ధాలు, పి.ఎం ప్రణామ్ తదితర కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తొలుత భోగి రెడ్డి కృష్ణమూర్తి పంట పొలం ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.