అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ లోని మెయిన్ బజార్ లో బుధవారం అనారోగ్యసమస్యలతో వెంకటమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి అర్ఎస్ కు చెందిన వెంకటమ్మ భర్త మృతి చెందినప్పటి నుంచి ఒంటరిగా గుత్తి అర్ఎస్ లోని మెయిన్ బజార్ లో అరుగు పై ఉంటూ జీవిస్తుంది. ఈ క్రమంలో వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. స్థానికులు మునిసిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం ఇస్తే వారు సీఎం పర్యటనలో ఉన్నామని అంటున్నారని అయితే శవాన్ని కుక్కలు లాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. వెంటనే మృతదేహాన్ని తరలించాలని కోరుతున్నారు.