నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని లింగి తండాలో వితంతువులకు పింఛన్ అందించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. లింగితండాలో సుమారు 40 మంది వితంతువులకు నాలుగేళ్లుగా పింఛన్ రావడం లేదన్నారు. అధికారులు స్పందించి బాధితులకు పింఛన్ ఇప్పించాలని కోరారు.