గంగవరం: చిన్నమనాయన పల్లి గ్రామంలో గత వారం వినాయక విగ్రహం నిమజ్జనం జరిగేటప్పుడు భార్గవ్ చరణ్ అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు రాజేంద్ర తదితరులు హాజరై వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసి సంఘీభావం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలని ఏర్పాటు చేసుకొని ఇటువంటి అపశృతులు తావు లేకుండా పండుగలు జరిగేలా చూస్తామని తెలిపారు.