అనకాపల్లి జిల్లాలోని మాడుగులలోని 30 పడకల సామాజిక ఆసుపత్రిని వంద పడకల మల్టీస్పెషల్ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మాడుగుల ఆసుపత్రి భవనాలను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన ఈ విషయం చెప్పారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని, వైద్యులు వృత్తి ధర్మాన్ని పాటించాలని, ప్రజలు వైద్యుల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.