లంబాడాలను ST జాబితా నుండి తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావులు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటేషన్ వ్యతిరేకిస్తూ బంజారా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వారి దిష్టి బొమ్మలను దగ్దం చేశారు.ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బాబురావు నాయక్ మాట్లాడుతూ వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం యావత్ తెలంగాణ బంజారా ప్రజలను మోసం చేసే ఉద్యేశంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంబాడీలకు అన్యాయం చేస్తే ఊరుకోమనీ హెచ్చరించారు.