కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన మాజీ ఎంపీడీవో ఇసుకపట్ల ఇమ్మానుయేల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆయన గురువారం మీడియాకు తెలియజేశారు. ఈ మేరకు కొత్తపేటలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గ ఎన్నికల రిటైనింగ్ అధికారి ఆర్డిఓ జీవీవీ సత్యనారాయణకు నామినేషన్ పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు.