యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూరు మండలం, బొడ్డుగూడెం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం క్షతకాత్రుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొడ్డుగూడెం గ్రామ శివారులో ఆదివారం రాత్రి అదుపుతప్పి ఆటో బారిగేట్లను ఢీకొట్టగా, ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న జానీ పాష, ప్రసాద్ లకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.