మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం మూల మలుపు వద్ద అంబులెన్స్, ద్విచక్ర వాహనం ఎదురేదురుగా ఢీకొన్న ఘటన ఆదివారం సాయంత్రం 4:00 లకు చోటుచేసుకుంది..ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు గంగారం మండల కేంద్రంలోని జజ్జరివారి గుంపునకు చెందిన జజ్జర్ గణేష్ గా గుర్తించారు.స్థానికుల సమాచారం తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.