యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు ఎం మండలం, కూరెళ్ల గ్రామంలోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులలో లేని, విధులకు హాజరుకాని ఎంఎల్ హెచ్ పి డాక్టర్ అశోక్ ను సస్పెండ్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.