పటాన్చెరు రుద్రారంలో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. తమ్ముడు షేక్ బాబర్, అన్న షేక్ బాబాపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. గాయపడిన బాబా ప్రస్తుతం పటాన్చెరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు శుక్రవారం తెలిపారు. ఘటనపై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.