గంజాయి అక్రమ రవాణా నిరోధక చర్యల్లో భాగంగా ఈగల్ టీం శనివారం ఒంగోలు రైల్వే స్టేషన్ లోనూ,వివిధ రైళ్లలోనూ సోదాలు జరిపాయి.ఇందుకోసం పోలీసు శునకాలను కూడా ఉపయోగించారు.ఈ క్రమంలో తిరుపతి నుండి పూరి వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలులో నాలుగు కిలోల గంజాయి దొరికిందని సీ.ఐ సుధాకర్ చెప్పారు.ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఇకపై నిరంతరం ఈ సోదాలు జరుగుతాయని చెప్పారు.