యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తో పాటు పలువురు రైతు సంఘం నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీసులు నారాయణపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ భూభాదితులకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇద్దామనుకుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. భూ బాధితులకు మార్కెట్ ధర కంటే రెండింతలు ఎక్కువ చెల్లించాలని డిమాండ్ చేశారు.