తాడ్వాయి మండలంలోని పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మురళి తెలిపారు.మండలంలోని కన్కల్ గ్రామ శివారులోని మైన్స్ గుట్ట దెగ్గర కన్కల్ గ్రామానికి చెందిన ఐదుగురు ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారంతో రైడ్ చేసి పట్టుకున్నట్లు ఎస్సై మురళి తెలిపారు. అందులో ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారని తెలిపారు. పేకాట స్థావరంలో పట్టుబడిన వారి వద్ద నుండి రూ, 2850 నగదు,ముడు మొబైల్ ఫోన్లు,మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.