జిల్లాలో పెన్షన్ల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణ అధికారులను ఆదేశించారు, ఒకటో తేదీ సోమవారం జిల్లాలోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ అనకాపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో పెన్షన్ పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు, అలాగే అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి నాయకులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.