ఆత్రేయపురం మండలం లోని తాడిపూడి గ్రామానికి చెందిన జక్కంశెట్టి దివ్య అనే మహిళ అదృశ్యం అయ్యింది అని తల్లి వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. వరలక్ష్మికి ఇద్దరు అమ్మాయిలు సంతానం. చిన్న కూతరు జక్కంశెట్టి దివ్య కుమారికి ఏడాది క్రితం తన అన్న కొడుక్కి ఇచ్చి వివాహం చేసినది. వరలక్ష్మి అనారోగ్యం బారిన పడడంతో తల్లిని పరామర్శించేందుకు వచ్చింది. తల్లి వరలక్ష్మి పొలం పనులుకు వెళ్లగా అదే రోజున జక్కంశెట్టి దివ్య ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.