జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు పునర్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోనీ తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు పునర్ నిర్మాణంపై డ్వామా, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునర్ నిర్మాణం చేసి భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.