పర్యాటక రంగంలో ఓపెన్ పాలసీల ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని, అధిక రెవెన్యూ వస్తుందని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు. దానికి తగ్గట్లు ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. జిల్లా పర్యాటక శాఖ, వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఎంజీఎం మైదానంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్ తో పాటు భాగస్వామ్యమైన ఎంపీ మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణకు ముందు అధికారులు కాస్త టెన్షన్ పడ్డారని, వైజాగులో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని ధైర్యం చెప్పానన్నారు