ప్రధాని మోదీ తల్లిని విమర్శించినందుకు రాహుల్ గాంధీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండముది బంగారు బాబు డిమాండ్ చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం బాపట్లలో రాహుల్ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా బంగారు బాబు మాట్లాడుతూ బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను రాహుల్ ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలన్నారు.