అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని మార్నేపల్లి గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం బైక్ అదుపు తప్పి బోల్తా పడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రి కి చెందిన రాఘవేంద్ర, అశ్విని, వారి కుమార్తె కుందనలు గుంతకల్లులోని బంధువుల ఇంటికి వెళ్ళారు. తిరిగి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపు తప్పి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు