వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో తెల్లవారుజాము నుండి వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం పరికాపులు కాసారు రైతులు. చివరకు యూరియా దొరకకపోవడంతో గురువారం ఉదయం 8 గంటలకు రోడ్డుపైకి ఎక్కిన రైతులు రాస్తారోకో నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తాము వరి నాటు వేసి చాలా రోజులు అవుతుందని సమయం దాటిపోతే పంట దిగుబడి రాదని ఇంతవరకు యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు తమ గ్రామానికి యూరియా పంపించాలని వేడుకుంటున్నారు.