హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ట్రాలీ ఆటో కింద ఉన్న కుక్కపిల్ల కోసం వెళ్లిన 13 నెలల బాలుడు లోహిత్, డ్రైవర్ గమనించకుండా వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్లడంతో ఆటో చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.