కనిగిరి పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడాయి. పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో వినాయక చవితి పండుగకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మార్కెట్లు రద్దీగా మారాయి. పూల మార్కెట్లు, బట్టల దుకాణాలు, గణేష్ ప్రతిమలు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో విపరీతమైన రద్దీ ఏర్పడి ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో, ఆ ప్రాంతాలకు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.