తాడేపల్లిగూడెంను ఆరోగ్యవంతమైన పట్టణంగా రూపు దిద్దేందుకు శాసనసభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి స్వయంగా చూపించడం జరిగింది. కడగట్ల 32 వ వార్డులో నిర్మాణంలో ఉన్న సెమీ ఆసియన్ స్విమ్మింగ్ పూల్, రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పరిశీలించారు.