జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య నగర్ కాలనీవాసులను కాపాడాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ. దొడ్డి కొమురయ్య నగర్లో గత 20 ఏండ్లుగా పేదలు నివసిస్తున్నారన్నారు. నిరుపేదలకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందన్నారు. గత ప్రభుత్వాలు ఓటు హక్కు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కాలనీ వాసుల పేరు మీద చేసి అట్లాగే కొన్ని మౌలిక సదుపాయాలు, సిసి రోడ్లు, మురికి కాలువలు, మంచినీటి కనెక్షన్ మంజూరు చేశారని, కానీ ప్రస్తుతం అడవి ప్రాంతంలో ఉందని కాళీ చేయాలని చెబుతున్నారని తెలిపారు.