బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను తిరస్కరించి 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వేమూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ అశోక్ బాబుని ఆదివారం మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. రైతుల పక్షాన పోరాడే వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించటాన్ని తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబు గత 3 రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోవట్లేదు ఆయనకి ఏమైనా జరిగితే చంద్రబాబు, లోకేష్ బాధ్యత వహించాలని అంబటి రాంబాబు తెలిపారు.