చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం సామిరెడ్డి అటవీ ప్రాంత సమీపంలో రైతు హరినాథ్ కు చెందిన పశువుల పాకంలో పాడిఆవు చనిపోయి ఉండడాన్ని గురువారం ఉదయం రైతు గుర్తించారు. పాడిఆవును చిరుత పులి వేటాడి తిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న రైతు. గత కొద్ది నెలలుగా చిరుత పులి అటవీ ప్రాంత సమీపంలో సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న రైతులు. ఘటన గురువారం మధ్యాహ్నం ఒక గంటలకు వెలుగులో వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు అటవీ శాఖ అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.