జంగారెడ్డిగూడెంలో అటవీ శాఖ అమరవీల దినోత్సవం సందర్భంగా నిర్వహణలో అటవీ సంరక్షణ కొరకు ప్రాణాలు అర్పించిన అధికారులకు, సిబ్బందికి నివాళులు అర్పించిన జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్ శాఖ అధికారులు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ శాఖ ఉద్యోగుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డివిజన్ కు సంబంధించిన అటవీ శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.