నిన్న మంగళవారం రెండవ తేదీన రాత్రి 11:30 గంటలకు వరంగల్ లోని రంగసాపేటలో తన మిత్రుని ఇంటికి వెళ్ళొస్తానని ద్విచక్ర వాహనంపై వెళ్లిన తన కుమారుడు మూడో తేదీ తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో గోపాల్పూర్ కి తిరిగి వస్తుండగా ఆర్టీవో జంక్షన్ వద్ద లారీ ఢీకొని మృతి చెందిందని తల్లి భవాని మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్టీవో జంక్షన్ వద్ద అజా జాగ్రత్తగా అతివేగంగా లారీ డ్రైవర్ డ్రైవింగ్ చేసి తన కుమారుని వాహనాన్ని గుద్దడంతోనే తన కుమారుడు మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు మామునూరు పోలీసులు. సాకేత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యుల