పలమనేరు: పట్టణంలో తాపీ మేస్త్రీల సంఘాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. పట్టణంలోని మేస్త్రీలందరు ఒకచోట చేరి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గజేంద్ర, ఉపాధ్యక్షుడిగా ఉమాపతి, కార్య దర్శిగా వెంకటేశ్, జాయింట్ సెక్రటరీగా మణికంఠ, ట్రెజరర్ గా వసరాయప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ, మేస్త్రీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.