లిక్కర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని మడకశిర మెట్టబండ అంజనేయ స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో ఈరలక్కప్ప, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ వై ఎన్ రవి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించిందని ఈర లక్కప్ప ఫైర్ అయ్యారు.