చారిత్రక ప్రాధాన్యం ఉన్న చినగంజాం మండలం మోటుపల్లి వద్ద సముద్రం లో శనివారం మూడు అడుగుల కృష్ణుడి విగ్రహం దొరికింది.ఆ బీచ్ లో వినాయక నిమజ్జనాలకు వచ్చిన యువకులు సముద్ర స్నానం చేస్తుండగా వారికి ఈ విగ్రహం తగలడంతో ఒడ్డుకు చేర్చి పోలీస్,రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.వెంటనే తహసిల్దార్ ప్రభాకరరావు,ఎస్ఐ రమేష్ లు అక్కడికి చేరుకొని ఆ విగ్రహాన్ని పరిశీలించారు.చీరాల ఆర్డీవో చంద్రశేఖర నాయుడు సూచనల మేరకు పురావస్తు శాఖ అధికారులకు ఈ విగ్రహాన్ని అప్పగించినట్లు తహసిల్దార్ చెప్పారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది