ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామ చెరువు కట్ట పూర్తిగా తెగిపోవడంతో పరిసర ప్రాంతాల్లో నీరు ప్రవహించి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే గ్రామానికి చేరుకొని చెరువు కట్టను ప్రత్యక్షంగా పరిశీలించారు. వరద ప్రభావిత కుటుంబాలను పరామర్శించి, వారి పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. సంబంధిత అధికారులను సమావేశం నిర్వహించి తక్షణ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన వరదల నష్టాలను ముఖ్యమంత్రి తెలియజేస్తానన్నారు.