ఖరీఫ్ సాగులో రైతులకు ఎరువుల కొరత లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. శనివారం వేమూరులో వ్యవసాయ శాఖ అధికారులు, పిఎసిఎస్ అధ్యక్షులతో ఎరువుల పంపిణీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో 90 వేల ఎకరాలకు పైగా ఖరీఫ్ లో సాగు జరుగుతుందని, అందుకు సరిపడా ఎరువులు అందించే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి రైతుకు, ముఖ్యంగా కౌలు రైతులకు ఎరువులు సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.