హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామంలోని మల్లప్ప శల క్షేత్రం రంగనాయక స్వామి గుడిలో ఈనెల 22న గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్లో కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ముద్దాయిలను మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... మల్లప్ప శల క్షేత్రం లోని రంగనాయక స్వామి గుడిలో పదిమంది గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని, వారిలో ఆరుగురిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.