సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించి ఘటన స్థలాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జరిగిన ఘటనపై అధికారులతో చర్చించారు. హాస్టల్లోని మిగిలిన భవనాల స్టాండర్డ్స్ ను పరిశీలించి ఉపయోగానికి పనికిరాని వాటిని బ్లాక్ చేసి నివేదిక సమర్పించాలని ఆర్ఎన్బి అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థుల క్లాసులు యధావిధిగా కొనసాగేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ను ఆదేశించారు.