ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం పురుగుమందు తాగి ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన సోమవారం బి కొత్తకోట మండలంలో జరిగింది. ఘటనపై పోలీసుల కథనం మేరకు.. కుటుంబ సమస్యల కారణంగా మిలటరీలో ఉద్యోగం చేస్తున్న కొత్తకోట మండలం బావగారి పల్లికి చెందిన కె ప్రకాష్ 21 పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు చికిత్స అందించి అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.