వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన డి.ఆర్.ఎస్ మరియు బిజెపి కార్యకర్తలు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య సమక్షంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవూరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేవేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.