గుంటూరు శివారులోని తురకపాలెం గ్రామంలో గత మూడు నెలల వ్యవధిలో జ్వరంతో సుమారు 30 మంది మరణించడంపై సీపీఎం జిల్లా కార్యదర్శి నేతాజీ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం గ్రామాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మరణాలకు కారణాలను కనిపెట్టి, ప్రజలకు భరోసా కల్పించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు. తక్షణమే వైద్య బృందాలను పంపి పరిస్థితిని సమీక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు.