యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు ఎం మండలం, సింగారం గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ ఆదివారం సాయంత్రం ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏబీసీడీ వర్గీకరణ సాధ్యమైంది అన్నారు. జూలై 7 న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు పెద్ద ఎత్తున ఊరు రా జెండాలు ఎగురవేసి, సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం మాదిగల పక్షాన ఉన్నది కనుకనే విజయం సాధించగలిగామన్నారు.