భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం గుంటూరు బ్రాడీపేటలో మంగళవారం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కె.యస్ లక్ష్మణరావు సమావేశాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ చేస్తున్న పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటూ దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పటిష్టంగా ఉండటం శుభపరిణామని కొనియాడారు. ఎస్ఎఫ్ఐ అభివృద్ధికి విద్యార్థులు కృషి చేయాలని ఆయన సూచించారు.