ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన బుట్టా రేణుక..ఎమ్మిగనూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుక సోమవారం తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రూ.12 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యిందని, కానీ కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.