నల్గొండ జిల్లా, చిట్యాల మండల పరిధిలోని, ఏపూరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. మధ్యప్రదేశ్ కు చెందిన అజిత్ బన్సాల్ అనే కార్మికుడు చిట్యాల మండలంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కాగా అతని కుటుంబంతో కలిసి ఏపూరిలో నివాసముంటుండగా శనివారం సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో ఇనుపరాడును పట్టుకోవడంతో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. మృతుడి భార్య రాధా బన్సాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.