మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రజాసేవ భవన్లో మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల దండలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందన్నారు.