అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కౌన్సిలర్లు రేష్మ పర్వీన్, అబ్ధుల్ రహీంలు చీపుర్లు చేత పట్టి రోడ్లను శుభ్రం చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణంలోని రోడ్లు చెత్తా, చెదారంతో నిండు కోవడంతో సోమవారం వేకువజామునే వారు సీబీ రోడ్డుకు చేరుకొని పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లను ఊడ్చారు. రోడ్లపై పడి ఉన్న ప్లాస్టిక్ పేపర్లు, వ్యర్థ పదార్థాలను తొలగించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రోడ్లను సిబ్బందితో కలిసి ఊడ్చామని కౌన్సిలర్లు తెలిపారు.